Saturday, October 14, 2017

Lingapuram - లింగాపురం

నాటి లింగాంబ అగ్రహారమే నేటి లింగాపురం
ప్రత్యేకతను చాటుకుంటున్న లింగాపురం
నో పోలీస్ అంటున్న గ్రామస్థులు

పౌరుషాల పోతుగడ్డగా పేరు గాంచిన పల్నాడులో ఫ్యాక్షన్ ముఠాల గొడవలు, నక్సల్స్ ప్రభావంతో గ్రామాల్లో అలజడులు ఉన్న సమయంలో శాంతి బావుటాను ఎరురవేస్తూ ఎటువంటి వివాదాలు, గొడవలు లేని(కేసులు లేని) వివాద రహిత గ్రామంగా సమైఖ్య అంధ్రప్రదేశ్ రాప్రంలో రికార్డులకెక్కి రికార్డు సృష్టించిన  గ్రామం మాచర్ల మండలంలోని లింగాపురం, పలు పత్యేకతలు వున్న ఈ గ్రామం మిగిలన గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తుంది.


నాటి లింగాంబ అగ్రహారమే నేటి లింగాపురం....
లింగాపురం గ్రామం ఎట్లా ఏర్పడిందనేది నేటి తరం వారికి పెద్దగా తెలియదు. మాచర్ల పట్టణంలోని చెన్నకేశవాలయం పక్కనే వున్న యిష్పకామేశ్వరి, వీరభద్రేశ్వర స్వాముల వార్లకు క్రీ.శ. 1554 సంవత్సరం లో విజయనగర సామ్రాజ్యంలో సదాశివరాయదేవ రాజ్యపాలన చేస్తుండగా, సామంతుడైన మండలేశ్వరుడు తిమ్మనాయునిం పాలనలోని నాగార్జునకొండ సీమ లోని మాచెర్లకు ఉత్తర దిక్కున సుమారు రెండు కిలోమీటర్లు దూరంలో చంద్రవంక సమీపంలో తిమ్మనాయునిం భార్య లింగాంబ అగ్రహారము కట్టించి ఇచ్చినది. అక్కడి ప్రజలు జీవనోపాది పొంది దేవాలయంకు కొంత సొమ్ము ఇచ్చుటకు 1246 యకరములు 6 సెంట్లు భూమిని ఇచ్చినట్లు, దేవరకు  ఇవ్వని వారు వారణాసిలో తల్లిదండ్రులను చంపిన పాపాన పోతారంటూ యిష్పకామేశ్వరి, వీరభద్రేశ్వర దేవాలయంలో ఎర్రరాతి రాతి శాసనం వేయించింది. లింగాంబ అగ్రహారంగా పిలువపడే ఈ గ్రామం కాలక్రమేనా లింగాపురంగా మార్పచెందింది.
గ్రామాన్ని రెండుగా చీల్చిన సాగర్ కుడి కాలువ...
1958 నాటికి 800 మందికి పైగా జనభాతో పంచాయితీగా ఏర్పడ్డ లింగాపురం చంద్రవంక ఓడ్డున పచ్చని పొలాలతో అలరాడుతున్న గ్రామాన్ని నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ రెండుగా చీల్పించి. నాగార్జున సాగర్ కుడి కాలువ గ్రామానికి కూత వేటు దూరం నుంచి వెళ్తుండటంతో కాలువ ఆవలి వైపు పొలాలు వున్న గ్రామసులు వారి పొలాలకు పోవాలంటే తీవ్ర ఇబ్బందులు పడే వారు. దీంతో కాలువ అవతలివైపు వున్న పొలాలు వున్న గ్రామస్థులు సగం మంది మాచర్ల పట్టణంలోని చెన్నకేశవాలయం వెనుక భాగాన లింగాపురం కాలనీగా ఏర్పాటు చేసుకొని నివాసం వుంటున్నారు.
ప్రత్యేకతను చాటుకుంటున్న గ్రామం...
60 ఏళ్లు క్రితం 800 జనాభాతో పంచాయితీగా ఏర్పడ్డ గ్రామం, ప్రస్తుతం 480 మంది జనభా మాత్రమే వున్నారు. గ్రామంలో బీసీ వర్గాలలోని ఒక సామాజిక వర్గం, ఎస్సీ వర్గాలలోని ఒక సామాజిక వర్గం (ముదిరాజులు, మాల ) వారు మాత్రమే గ్రామంలో నివాసం వుండటం విశేషం. గ్రామ స్థాయిలో ఏ ఎన్నికలు జరిగినా అందరూ కూర్చుని మాట్లాడుకుని ఏకగ్రీవంగా నాయకుడ్ని ఎన్నుకుంటారు. ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టిన దానిని గ్రామంలో పక్కాగా అమలు జరపటంలో గ్రామం ముందుంటుంది. నిర్మల్ గ్రామ పురస్కార్ అవార్డుకు ఎంపికకాగా, మండలంలో మొదటి ఓడీఎఫ్(బహిరంగ మలవిసర్జన నిర్మూలన ) గ్రామంగా అధికారులు ప్రకటచించారు.
గ్రామంలో నో పోలీస్..
2013 జనవరిలో హైదరాబాద్ లిగల్ సెల్ అథారిటి ఎటువంటి కేసులు లేని లింగాపురాన్ని వివాదరహిత గ్రామంగా ప్రకటించించారు. అప్పటి ఉమ్మడి రాప్రంలో హైకోర్ట్ ప్రధానన్యాయమూర్తి జసీస్ పినాకి చంద్ర ఘోష్, సీనియర్ న్యాయమూర్తులు రఘురాం, ఈశ్వరయ్యలతో కలసి గ్రామాన్ని సందర్శించి రాప్రంలో మొదటి వివాదరహిత గ్రామంగా ప్రకటించారు.గ్రామస్థులు  నో పోలీస్.. అంటూ, ఏ సమస్య వచ్చినా గ్రామస్థులు, పెద్దలు సమక్షంలో పరిష్కరించుకుంటారు. ఇలా తన ప్రత్యేకత చాటుకుంటూ మిగిలిన గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు లింగాపురం గ్రామ ప్రజలు.
Satishbabu Pavuluri