Friday, October 22, 2021

 గురజాల గంగాంబ ఆలయం

"కులము దైవతంబు గురిజాల గంగాంబ
కలని పోతులయ్య చెలిమికాడు
పిరికికండ లేని యరువది యేగురు
పల్లెనాటి వీరబాంధవులకు" --- ( క్రీడాభిరామము, క్రీ.శ. 1440 )

పల్నాటి వీరులచే ఘన పూజలు అందుకున్న గంగమ్మ తల్లి. క్రీ.శ. 1150 ఆ ప్రాంతంలో పల్నాటి రాజ్యపు రాజులు, రాజపరివారము, ప్రజలచే నిత్యపూజలందుకుంటూ, గురజాల రాజ్య ప్రజల రక్షగా, గ్రామ దేవత గా కొలువైయున్నది. ప్రస్తుతం ఆలయము శిధిలావస్తు లో ఉన్నది.




 మాచెర్ల వీరభద్రస్వామి గుడి శాసనము 

క్రీ.శ. 1544 విజయనగర చక్రవర్తి సదాశివరాయ పాలనలో మాచెర్ల పాలకుడిగా ఉన్న తిమ్మనాయుడు భార్య లింగాంబ దాన శాసనం రాయి ఇది. లింగాంబ చంద్రవంక వొడ్డున లింగాపురం అనే అగ్రహారం కట్టించి మాచెర్ల వీరభద్రుడుకి, ఇష్ట కామేశ్వర స్వామికి దానంగా ఇచ్చింది. ఈ శాసన రాయి వెనుక వైపు కాన్వాజుపోతినేని  అనే శిల్పి చేతి మూర ఉన్నది.ఈ మూర 25 అంగుళాలు. 65 సెం.మీ ఉన్నది.